హైదరాబాద్: తెలంగాణ లో కరోనా కారణంగా గత పది నెలలుగా సినిమా థియేటర్లు మూతపడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో థియేరట్ల పునః ప్రారంభం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
థియేటర్లు కేవలం 50 మంది ప్రేక్షకులతో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకోవచ్చని తెలిపింది. సినిమా హాళ్లలో మాస్క్ లు, శానిటైజర్ లు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. అలానే ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది.
ఒక్కో షోకు ముందు థియేటర్ల పరిసరాలను శానిటైజేషన్ చేయడం తప్పనిసరి అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే ఇప్పటికే మేసిఫెస్టోలో కేసీఆర్ సినిమా థియేటర్ల యజమానులకు పలు వెసులుబాట్లు కూడా కల్పించారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా టికెట్ ధర పెంచుకోవచ్చని తెలపడమే కాక విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు కూడా రద్దు చేస్తామని, 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ సినిమాలకు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్తో సాయం చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తామన్నారు.