బాలీవుడ్: టాలీవుడ్ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘భాగమతి’. జి.అశోక్ అనే దర్శకుడు ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించాడు. థ్రిల్లింగ్, సస్పెన్స్, ట్విస్ట్స్ ఈ సినిమాలో చాలా ఉండడం తో ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. ఇపుడు ఇదే సినిమాని బాలీవుడ్ లో ‘దుర్గామతి’ అనే పేరు తో రీ-మేక్ చేస్తున్నారు. అనుష్క నటించిన పాత్రలో భూమి ఫేడ్నేకర్ నటించింది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ విడుదలైంది.
సినిమా ట్రైలర్ చూసిన తర్వాత పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. ట్రైలర్ ఆద్యంతం అనుష్క పాత్రలో భూమి బాగానే ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. తెలుగు లో విలన్ పాత్రలో నటించిన మళయాళ హీరో ‘జయరాం సుబ్రహ్మణ్యం’ పాత్రలో హిందీ నటుడు ‘అర్షద్ వార్సీ’ నటించాడు. మరొక పోలీస్ పాత్రలో మాహి గిల్ మరియు జిషు సేన్ గుప్త నటించారు. సినిమా డైరెక్షన్, టేకింగ్ , సీన్స్ అన్ని కూడా దాపు తెలుగులో ఉన్నట్టే ఉన్నాయి. పెద్దగా మార్పులు కనపడలేదు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో విడుదల చేయనున్నారు.