అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై ఈ రోజు న నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. డిసెంబర్ 4 వరకు ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారైంది.
నవంబర్ 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు సమావేశాలపై నోటిఫికేషన్ గురువారం విడుదలయ్యింది. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే నిర్ణయంపై స్పష్టత రానుంది.
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి వరకు కేవలం అక్రమ ఇసుక, మద్యం అమ్మకాలకు మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిమితమైంది. ఇకపై గ్యాంబ్లింగ్, ఆన్ లైన్ బెట్టింగ్, డ్రగ్స్, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్ధాలు ఏస్ఈబి పరిధిలోకి తీసుకువచ్చింది.