సిడ్నీ: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సిజి) లో శుక్రవారం జరిగిన తొలి వన్డే ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్యా 76 బంతుల్లో 90, శిఖర్ ధావన్ 86 బంతుల్లో 74 పరుగులు భారత లక్ష్య చేధనకు సరిపోలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం మరియు ఐసిసి వన్డే సూపర్ లీగ్‌లో 10 పాయింట్లు సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆరోన్ ఫించ్ (114) మరియు స్టీవ్ స్మిత్ (105) సెంచరీలు చేసి 374 పరుగులు అందించారు. ఫ్లాట్ ఎస్సిజి వికెట్లో భారత బౌలర్లందరూ పరుగులు ఆపడానికి చాలా కష్టపడ్డారు.
ఇక భారీ స్కోరు చేధనలో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 308 పరుగులకు పరిమితం చేయబడింది. 14 వ ఓవర్లో 4 వికెట్లకు 101 పరుగుల వద్ద భారత్ ఇబ్బంది పడుతున్నప్పుడు బ్యాటింగ్‌లోకి వచ్చిన పాండ్యా, ధావన్‌తో కలిసి కీలక 128 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ఛేజ్‌లో ఆశలు నింపారు.
భారత ఇన్నింగ్ 24 వ ఓవర్లో పాండ్యా కేవలం 31 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని సాధించాడు. ఓపెనర్లు ధావన్, మయాంక్ అగర్వాల్ (18 పరుగులలో 22) తొలి ఆరు ఓవర్లలో 53 పరుగులు జోడించి జోష్ హజిల్‌వుడ్ చేతిలో అగర్వాల్ అవుటయ్యాడు.
విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు, ఒక సిక్సర్లతో 21 బంతుల్లో 21 పరుగులు చేసి, హాజిల్‌వుడ్ బౌలింగ్ లో ఫించ్‌కు షార్ట్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. చివరకి ఆసీస్ 66 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది.