సిడ్నీ: సిడ్నీ వేదికగా ఈ రోజు జరిగిన తొలి వన్డేలో భారత స్పిన్నర్ చహల్‌కి మరచిపోలేని రోజులా మారింది. తన అధ్బుతమైన బౌలింగ్‌తో ఎటువంటి బ్యాట్స్‌మెన్ కట్టడి చేసే చహల్ ఈ రోజు ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఈ క్రమంలోనే చెత్త గణాంకాలను నమోదు చేశాడు చాహల్.
ఒక వన్డే మ్యచ్ లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా అప్రతిష్ఠను మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లు బౌల్ చేసి ఒక వికెట్ మాత్రమే సాధించిన చాహల్ 89 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఒక భారత స్పిన్నర్‌గా వన్డేల్లో ఇదే ఒక చెత్త రికార్డు.
తన చెత్త రికార్డు తానే అధిగమించాడు చాహల్. వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్ గా చహల్ పేలవమైన రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్ కు ముందు 2019 ఎడ్జ్‌బాస్టన్ వన్డేలో ఇంగ్లాండ్‌పై 88 పరుగులు సమర్పించుకున్న చహల్ ప్రస్తుతం తన రికార్డును తానే అధిగమించాడు.