టాలీవుడ్: ‘ఈ నగరానికి ఏమైంది‘ సినిమా ద్వారా పరిచయం అయిన నటుడు సుశాంత్. ఈ సినిమాలో కార్తీక్ పాత్ర చేసిన నటుడు ఇపుడు హీరోగా ‘బొంబాట్’ అనే సినిమా ద్వారా రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయింది. ఈ సినిమాలో సుశాంత్ కి జోడీ గా చాందిని చౌదరి మరియు సిమ్రాన్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఈ సినిమా రూపొందింది. ‘టెక్నాలజీ ని లైఫ్ ని కంట్రోల్ చేయడానికో లేక నాశనం చేయడానికో వాడకూడదు.. బెటర్ చేయడానికి మాత్రమే వాడాలి’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పైన రకరకాల ప్రయోగాలు చేస్తూ ఒక మనిషి పైన ఆ ప్రయోగం చేసి అది ఎలా ఉంటుందనేది చూపించడం ఈ సినిమా ప్రయత్నం అని అర్ధం అవుతుంది.
సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఇది రెగ్యులర్ సినిమా లాగా కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కానీ సినిమా మొత్తం చూస్తే తెలుస్తుంది కొత్తగా ఏమైనా ఉందా లేదంటే మళ్ళీ పాత కథేనా అని. సినిమా ట్రైలర్ లో విజువల్స్ మరియు నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విశ్వాస్ హన్నూర్కర్ ఈ సినిమాని నిర్మించాడు. రాఘవేంద్ర వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 3 నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉండబోతుంది.