fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsమరో అరుదైన గౌరవం సాధించిన ఏ ఆర్ రెహమాన్

మరో అరుదైన గౌరవం సాధించిన ఏ ఆర్ రెహమాన్

ARRahman ReceivedRare BAFTAhonor

కోలీవుడ్: ఎన్నో సంవత్సరాలుగా ఇండియా కి అందని ద్రాక్ష గా ఉన్న ఆస్కార్ అవార్డు ని సాధించి భారత దేశ కీర్తి ని చాటాడు ఏ ఆర్ రెహమాన్. ఇపుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో మరో ఘనత సాధించాడు ఈ సంగీత దర్శకుడు. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ద్వారా ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా ఏ ఆర్ రెహమాన్ నియమితుడయ్యాడు. బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ నెట్ ఫ్లిక్స్‌తో కలిసి భారత్‌లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది.

తన మొదటి సినిమా రోజా తోనే నేషనల్ అవార్డు సాధించిన ఘనుడు ఏ ఆర్ రెహమాన్. తన కెరీర్ లో ఇప్పటికి చాలా అవార్డులు రివార్డులు సాధించాడు. ఇండస్ట్రీ లో ఇప్పటికీ చాల మంది తనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనీ ఆశ పడుతుంటారు. ఈ నియామకం పై రెహమాన్ కూడా స్పందించాడు. బాఫ్టాతో కలిసి పనిచేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular