టాలీవుడ్: లాక్ డౌన్ , కరోనా టైం లో కూడా వరుస పెట్టి సినిమా తీసి ATT ల్లో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇపుడు కరోనా వైరస్ నేపధ్యం లోనే ‘కరోనా వైరస్’ అనే సినిమా తీసాడు. రియల్ లైఫ్ హర్రర్ సినిమా ఇది అని ప్రచారం చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. డిసెంబర్ 11 న ఈ సినిమా విడుదల అవబోతుంది. లాక్ డౌన్ తర్వాత థియేటర్ లలో విడుదల అవుతున్న మొదటి తెలుగు సినిమా అని ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ పై భయం ఎక్కువగా ఉన్న టైం లో ఒక ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే నేపథ్యంలో ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. విడుదలకి ముందు ఈ సినిమాకి సంబందించిన మరొక ట్రైలర్ విడుదల చేసాడు వర్మ.
కరోనా భయం మరీ ఎక్కువగా ఉన్న టైం లో ఒక ఇంట్లో ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఎలా ప్రయత్నించాడు దానికి ఇంట్లో వాల్ల రెస్పాన్స్ ఎలా ఉంది అనేది సినిమా కథ. ట్రైలర్ లో చూపించినంత వరకు అయితే రామ్ గోపాల్ వర్మ కెమెరా యాంగిల్స్ మరియు విసుగు తెప్పించే పాత్రల స్వభావాలు, హావభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ లోనే ఇలా ఉంటే సినిమాలో ఇంకా ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఒక చిన్న ఇంట్లో అతి తక్కువ బడ్జెట్ తో లిమిటెడ్ పాత్రలతో ఈ సినిమా ని రూపొందించారు వర్మ. సినిమాకి ముఖ్య ఆకర్షణగా తండ్రి పాత్రలో నటించిన ‘శ్రీకాంత్ అయ్యంగార్‘ తన నటనతో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత వర్మ ‘మర్డర్’, ‘దిశా ఎన్కౌంటర్’ కూడా విడుదల చేసే పనిలో పడ్డాడు.