టాలీవుడ్: కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు షూటింగ్ లేక ఇండస్ట్రీ వెలవెలబోయింది. ఇపుడు అందరూ షూటింగ్ లు మొదలు పెట్టేసారు, రేపటి నుండి థియేటర్ లు కూడా తెరచుకుంటుండడం తో మళ్ళీ ఇండస్ట్రీ కి పూర్వ వైభవం రాబోతుంది. ఈ క్రమంలో టాలీవుడ్ క్రేజీ మూవీ RRR కూడా షర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే 50 రోజుల నైట్ షూట్ చేసి భారీ ఫైట్ ని నిరవధికంగా పూర్తి చేసారు. మొన్ననే హైదరాబాద్ సెట్ లో షెడ్యూల్ పూర్తి చేసిన సినిమా టీం వెంటనే మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ లో ప్రత్యక్షమైంది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు రాజమౌళి ఎంత స్పీడ్ గా RRR ని పూర్తి చేసే పనిలో ఉన్నాడో తెలియడానికి.
సినిమా షూటింగ్లు మాత్రమే కాకుండా రెగ్యులర్ గా అప్ డేట్లు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది సినిమా టీం. మహాబలేశ్వర్ లో సినిమా షూట్ కి సంబందించిన ఒక వీడియో కూడా విడుదల చేసారు. డ్రోన్స్ తో కేన్స్ తో ఒక బైక్ డ్రైవ్ ని షూట్ చేస్తున్నట్టు వీడియో లో చూపించారు. ఈ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన టీజర్స్ బట్టి ఎన్టీఆర్ బైక్ పైన కనిపించడం తో బహుశా ఆ సీన్స్ కొమరం భీం కి సంబందించినవి అని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. అయితే ఇది చాలా షార్ట్ షెడ్యూల్ అని మూవీ టీం తెలిపారు. బహుశా కొన్ని ఏరియల్ షాట్స్ కోసం ఈ లొకేషన్ ని సినిమా టీం ఎంపిక చేసి ఉంటుంది.