హైదరాబాద్: డిస్కవరీ ప్లస్ ఒరిజినల్ రక రకాల రియల్ లైఫ్ అడ్వెంచర్స్ తో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇదివరకే తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ తో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ మరియు బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ తో కూడా ఇంకో అడ్వెంచర్ చేయించారు. ఇపుడు ‘మిషన్ ఫ్రంట్ లైన్’ అనే కార్యక్రమం కోసం టాలీవుడ్ హీరో రానా ని BSF జవాన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగం గా రానా రియల్ లైఫ్ అడ్వెంచర్ చేసాడు. BSF (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్ గా ఒక రోజంతా విధులు నిర్వర్తించాడు.
‘మిషన్ ఫ్రంట్ లైన్ విత్ రానా దగ్గుబాటి’ అనే పేరుతో ఈ కార్యక్రమం రాబోతుంది. దీనికి సంబంచిన లుక్ ని డిస్కవరీ ప్లస్ వాల్లు విడుదల చేసారు. ఈ మిషన్ కోసం రానా జైసల్మేర్ సరి హద్దుల్లో ఒక రోజంతా జవాన్ గా గడిపారు. ఇదొక లైఫ్ టైం ఎక్సపీరియెన్స్ అని, యుద్ధ కథలు తనపై బాగా ముద్ర వేశాయని, ఒక రోజంతా ఇలా జవాన్ గా గడపడం జీవితం లో మరచిపోలేనని సోషల్ మీడియా లో రానా షేర్ చేసారు. మిషన్ ఫ్రంట్ లైన్ కి అవకాశమిచ్చిన డిస్కవరీ ఇండియాకు ధన్యవాదాలు తెలిపాడు.