టాలీవుడ్: కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు షూటింగ్ లేక ఇండస్ట్రీ వెలవెలబోయింది. ఇపుడు అందరూ షూటింగ్ లు మొదలు పెట్టేసారు. థియేటర్ లు తెరచుకొమ్మని ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా ఇన్ని రోజులు థియేటర్లు తెరుచుకోలేదు. అయితే రేపటి నుండి థియేటర్ లు కూడా తెరచుకుంటుండడం తో మళ్ళీ ఇండస్ట్రీ కి పూర్వ వైభవం రాబోతుంది అని అర్ధం అవుతుంది. రేపటి నుండి చాలా మల్టీప్లెక్స్ లు తెరచుకోనున్నాయి. AMB సినిమాస్, ప్రసాద్స్ ముల్టీప్లెస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏషియన్ మల్టిప్లెస్, PVR సినిమాస్ ఇలా చాలా వరకు రేపటి నుండి తెరచుకోనున్నాయి. వారి అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్ లలో కూడా ఈ విషయాన్ని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వం విధించిన కోవిడ్ నియమాలని పాటిస్తూ థియేటర్ లని తెరుస్తున్నామని ప్రకటించారు.
ఐతే మొదటి విడతగా పాత సినిమాల్నే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో వస్తున్న ‘టెనెట్’ సినిమా. ఈ సినిమా మన దేశం లో రేపే డైరెక్ట్ విడుదల అవుతుంది. చాలా మంది సినిమా అభిమానులు బుకింగ్స్ తెరచుకోగానే ఈ సినిమాకే ఎక్కువగా బుక్ చేసుకున్నారు. ఈ సినిమాతో పాటు లాక్ డౌన్ కి కొంచెం ముందు విడుదల అయిన దుల్కర్ సల్మాన్ ‘కనులు కనులని దోచాయంటే’ సినిమా కూడా థియేటర్ లలో రేపు విడుదల అవబోతుంది. వీటితో పాటు మరోసారి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి కూడా విడుదల అవుతుంది. ఇక వచ్చే వారం రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’, 25 న సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ డైరెక్ట్ గా థియేటర్ లలో విడుదల అవబోతున్నాయి. ఈ సినిమాల రెస్పాన్స్ ని చూసి జనవరి నుండి మళ్ళీ థియేటర్ లు పూర్వ కళని సంతరించుకుంటాయని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు.