హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తను రాసిన లేఖలో పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపిన ఉత్తమ్, తాణు గతంలోనే ఏఐసీసీకి లేఖ రాశానని, ఆమోదించాలని కోరారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది కాలంగా ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.
దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి అనంతరం ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లలో(ఉప్పల్, ఏఎస్ రావు నగర్) మాత్రమే విజయం సాధించడంతో ఓటమికి భాద్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు.