కోలీవుడ్: ఒక మామూలు కుటుంబం నుండి వచ్చి సినిమా నటి గా సౌత్ లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లో ఒక శక్తి గా ఎదిగి తమిళనాట ‘అమ్మ’ అని సంబోధించేంత స్థాయి కి చేరుకున్నారు తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి ‘జయ లలిత’ గారు. తాను ముఖ్య మంత్రిగా పదవీ కాలం లో ఉండగానే అస్వస్థకు గురై కన్ను మూసారు. జయ లలిత గారి కథ ఆధారంగా ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకర్వంలో ఒక వెబ్ సిరీస్ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లు మరియు సినిమాల రూపం లో కూడా అమ్మ కథ మన ముందుకు రాబోతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘కంగనా’ అమ్మ పాత్రలో నటించిన ‘తలైవి’.
నిన్న జయలలిత గారి వర్ధంతి సందర్భంగా తలైవి వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసారు. ఇందులో జయలలిత లుక్ ని కంగనా దించేశారు. తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా షూట్ ముగియనుంది కంగనా కూడా ట్వీట్ చేసారు. కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ‘తలైవి’ చిత్రాన్ని తెలుగు, మరియు తమిళ్ మాత్రమే కాకుండా హిందీ లో కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.