వుహాన్: చైనా యొక్క “బ్యాట్ ఉమెన్” గా పిలువబడే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ వైరస్లపై పరిశోదించే శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు పారదర్శకంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని, సైన్స్ తో రాజకీయం చేయబడటం “చాలా విచారకరం” అని అన్నారు.
“రాబోయే కాలంలో అంటు వ్యాధుల బారిన పడకుండా మానవులను నివారించాలనుకుంటే, ప్రకృతిలో అడవి జంతువులు మోస్తున్న ఈ తెలియని వైరస్ల గురించి తెలుసుకోవడానికి మరియు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికి మనం ముందుఉండాలి. మనం వాటిని అధ్యయనం చేయకపోతే మరొక వ్యాప్తి ఉండవచ్చు.” అని షి CGTN తో అన్నారు.