fbpx
Sunday, January 5, 2025
HomeMovie Newsప్రీక్వెల్ తో రాబోతున్న గేమ్ అఫ్ థ్రోన్స్

ప్రీక్వెల్ తో రాబోతున్న గేమ్ అఫ్ థ్రోన్స్

GameOfThronesPrequel HouseOfDragon FirstLook

హాలీవుడ్: లాక్ డౌన్ వల్ల మన దగ్గర ఎంటర్టైన్మెంట్ లేక జనాలు వెబ్ సిరీస్ లు, టీవీ సిరీస్ ల వైపు చూసారు కానీ హాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల హవా ఎప్పటినుండో కొనసాగుతుంది. HBO లో ప్రసారమయ్యే ‘గేమ్ అఫ్ థ్రోన్స్‘ అనే సిరీస్ కి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 7 ,8 సీసాన్లు ప్రసారం అయ్యాయి. అన్ని సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. చివరగా 8 వ సీజన్ తో ఈ సిరీస్ ని ముగించారు. ఈ సిరీస్ కి మన దగ్గర కూడా చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఈ సిరీస్ లు హాలీవుడ్ మూవీ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కి ప్రీక్వెల్ తో మన ముందుకు వస్తున్నారు మేకర్స్. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఈ ప్రీక్వెల్ ని ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్` అనే పేరు తో రూపొందిస్తున్నారు. జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ రాసిన ఫైర్ అండ్ బ్లడ్ అనే పుస్తకం ఆధారంగా ఈ ప్రీక్వెల్ రూపొందబోతుందని మేకర్స్ తెలిపారు. గేమ్ అఫ్ థ్రోన్స్ సిరీస్ లో కేవలం 3 డ్రాగన్స్ నే చూపిస్తారు. ఈ ప్రీక్వెల్ లో ఇంకా ఎక్కువ డ్రాగన్స్ ని చూపించే అవకాశం ఉంది. గేమ్ అఫ్ థ్రోన్స్ కంటే 300 ఏళ్ళ ముందు కథ తో ఈ ప్రీక్వెల్ రూపొందబోతుంది. 2022 లో ఈ సిరీస్ విడుదల చేయనున్నారు. గేమ్ అఫ్ థ్రోన్స్ ఎండింగ్ సీజన్ తో ప్రేక్షకులు కొంత నిరాశతో ఉన్నా కూడా ఈ సిరీస్ కి ఇంకా ఆరాధించే అభిమానులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular