కోలీవుడ్: కోలీవుడ్ లో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటాడు. విజయ్ మూవీ వస్తుందంటే అక్కడ ఫాన్స్ హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. కార్తీ తో ఖైదీ సినిమా తీసిన ‘లోకేష్ కానగరాజ్’ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇన్ని రోజులు ఆలస్యం అయింది. కానీ పరిస్థితులు ఇపుడిపుడే మెరుగు పడుతుండడం తో జనవరి లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు విజయ్ ఏ సినిమాని సైన్ చెయ్యలేదు. ఇపుడు తన తదుపరి సినిమాని సన్ పిక్చర్స్ వారితో ప్రకటించాడు.
విజయ్ తన 65 వ సినిమా సన్ పిక్చర్స్ వారితో చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నయనతార ముఖ్య పాత్రలో నటించిన ‘కో కో కోకిల’ సినిమాకి దర్శకత్వం వహించిన ‘నెల్సన్ దిలీప్ కుమార్’ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ డైరెక్టర్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి ‘డాక్టర్’ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఆ సినిమా ముగియగానే విజయ్ తో సినిమా మొదపు పెట్టే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. విజయ్ కి కత్తి, మాస్టర్ లాంటి సినిమాలతో సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా ద్వారా అనిరుద్ మరియు విజయ్ కాంబో లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.