fbpx
Friday, December 27, 2024
HomeNationalవిషమ పరిస్థితుల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం

విషమ పరిస్థితుల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం

LALUPRASAD-YADAV-HEALTH-CONDITION-CRITICAL

పట్నా: బిహార్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించిందని డాక్టర్లు తెలిపారు. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం.

హాస్పిటల్ డాక్టర్‌ ఉమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ, లాలూ ప్రసాద్ యాదవ్ గారి కిడ్నీలు ప్రస్తుతం కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ఆయన కిడ్నీ పనితీరు ఎప్పుడైనా పూర్తిగా క్షీణించే ప్రమాదం ఉంది. అది ఎప్పుడు అనేది ఊహించడం చాలా కష్టం. కానీ అది ఖచ్చితంగా జరగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం.

ఈ విషయం గురించి నేను అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపాను. ఇప్పటికే ఆయన అనేక రకాలైన తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందటున్నారు, ఇప్పుడు కొత్తగా మూత్రపిండాల పనితీరు కూడా క్షీణిస్తోంది. ఇప్పటికే లాలూ డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందువల్ల ఆయన రెండు కిడ్నీల పనితీరు క్రమంగా క్షీణించిందని రిమ్స్‌ వైద్యుడు ప్రసాద్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా, లాలూకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు జనవరి 22కి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular