fbpx
Sunday, October 27, 2024
HomeInternationalగూగుల్ సర్వీసెస్ గంట అంతరాయం తరువాత పున:ప్రారంభం

గూగుల్ సర్వీసెస్ గంట అంతరాయం తరువాత పున:ప్రారంభం

GOOGLE-SERVICES-OUTAGE-WORLDWIDE

న్యూఢిల్లీ: మనం ఏ ప్రశ్నకైనా జవాబు కావాలన్నా, ఎదైనా వెతకాలన్నా మొదట గుర్తు వచ్చేది గూగుల్. అలాంటి గూగుల్ కు సోమవారం కాస్త అంతరాయం ఏర్పడింది. జీమెయిల్‌తో సహా ఇతర గూగుల్‌ సేవల్లో సోమవారం సాయంత్రం 5.17 గంటలకు అంతరాయం ఏర్పడింది.

ఇంకా గూగుల్ సర్వీసెస్ అయిన గూగుల్‌ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్‌ వంటి వాటిలోకి లాగిన్‌ అయినవారికి స్క్రీన్‌పై టెంపరరీ ఎర్రర్‌ అంటూ ఒక మెసేజ్‌ దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి దాదాపు 45 నిమిషాలపాటు కొనసాగింది. ‘ఇంటర్నల్‌ స్టోరేజీ కోటా’లో సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు గూగుల్‌ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు.

తిరిగి సోమవారం సాయంత్రం 6.02 గంటలకల్లా సేవలను పునరుద్ధరించగలిగామని తెలిపారు. అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఇబ్బంది పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌ సేవలు నిలిచిపోవడం పట్ల సోషల్‌ మీడియాలో సెటైర్లు పడ్డాయి. జీమెయిల్‌ డౌన్, యూట్యూబ్‌ డౌన్‌ అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. మరికొందరు ‘ఇది యుగాంతం’ అంటూ సరదాగా కామెంట్లు చేయడం కూడా కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular