fbpx
Thursday, December 26, 2024
HomeBig Storyఅమెరికాలో అతిపెద్ద వ్యాక్సినేషన్, నర్సు కు తొలి టీకా

అమెరికాలో అతిపెద్ద వ్యాక్సినేషన్, నర్సు కు తొలి టీకా

SANDRA-NURSE-VACCINATED-FIRST-IN-USA

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికా దేశ చరిత్రలోనే ఇప్పుడు అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్‌లో ఉన్న లాంగ్‌ ఐలాండ్‌ జ్యుయిష్‌ మెడికల్‌ సెంటర్‌ ఐసీయూలో నర్సుగా పని చేస్తున్న సాండ్రా లిండ్సేకు అమెరికా లో తొలి వ్యాక్సిన్‌ డోసు ఇచ్చారు.

అమెరికాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న ఈ విపత్కర సమయంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావడంతో అక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ డోసును సాండ్రా లిండ్సేకు సోమవారం ఇచ్చారు. కరోనా నుంచి త్వరగా కోలుకుంటానని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగిసిపోవడానికి ఇదొక ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు ఉద్వేగంతో తెలిపారు.

కరోనాను అంతమొందించే ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, పూర్తి రక్షణ ఇస్తుందని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు వివరించారు. చీకటిలో వెలుగు రేఖ కనిపించినప్పటికీ ప్రజలు కరోనా నియంత్రణ నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాలని సాండ్రా సూచించారు. మాస్కులు ధరించాలని కోరారు. కరోనా టీకా తీసుకునేలా ఇతరులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

తమ దేశంలో తొలి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభం కావడం పట్ల అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చాలా‌ హర్షం వ్యక్తం చేశారు. ‘అమెరికాకు మరియు ప్రపంచానికి కూడా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ గవర్నర్‌ మాట్లాడుతూ, కరోనాపై జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే ఆయుధం ఈ వ్యాక్సిన్‌ అని చెప్పారు. పుస్తకంలోని చివరి అధ్యాయం ఇప్పుడు మొదలైందని పేర్కొన్నారు. తాను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటానని ఫైజర్‌ సీఈఓ ఆల్బర్ట్‌ ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular