fbpx
Wednesday, December 25, 2024
HomeInternationalఅనుకున్న దానికంటే ఎక్కువగా వేడెక్కుతున్న భూమి

అనుకున్న దానికంటే ఎక్కువగా వేడెక్కుతున్న భూమి

EARTH-WARMING-MORE-THAN-EXPECTED

న్యూఢిల్లీ : వాతావరణ శాస్త్రవేత్తలు తాము వేసిన అంచనాల కన్నా భూగోళం 0.3 ఫారిన్‌హీట్‌ డిగ్రీలు ఎక్కువగా వేడెక్కుతోందని వెల్లడించారు. ఈ మేరకు ‘హాడ్‌క్రుట్‌’ గతంలో వేసిన అంచనాలలో ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్శిటీకి చెందిన వాతావరణ విభాగం మార్పులు చేసింది.

హాడ్‌క్రుట్‌’, గ్లోబ్ ఉష్ణోగ్రత డేటాలను ఎప్పటికప్పుడు సేకరించి డేటా బేస్‌లో భద్రపర్చే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూ వాతావరణ అంచనాలు వేసే సంస్థ. 1850లో ఉన్న భూగోళం ఉష్ణోగ్రతకన్నా 2010–18 కాలం నాటికి భూగోళం ఉష్ణోగ్రత 1.90 ఫారిన్‌హీట్‌ డిగ్రీలు పెరగుతుందని హాడ్‌క్రుట్‌ ఒక అంచనా వేసింది. అయితే వాస్తవానికి భూతాపం 1.93 ఫారిన్‌హీట్‌ పెరిగింది.

భూతాపం గత 170 సంవత్సరాలుగా పెరగడానికి ప్రధాన కారణం మనుషుల వల్ల వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలేనని పరిశోధకులు తెలిపారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్‌ ఓసియానిక్‌ అండ్‌ అట్మాస్పిరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఓఏఏ) అంచనాలకన్నా భూతాపం పెరగడం తక్కువగా ఉంది. హాడ్‌క్రుట్‌ అంచనాలే ఇంతకాలం నిజం అవుతూ వచ్చాయి.

ఈసారి కూడా హాడ్‌క్రుట్‌ అంచనాల్లో కేవలం 0.3 ఫారిన్‌హీట్‌ డిగ్రీల తేడామాత్రమే వచ్చింది. 1986లో మొదటి సారి తమ విభాగం భూతాపంలో పెరుగుదల అంచనా వేసిందని, ఈస్ట్‌ ఆంగ్లియా యూనివర్శిటీలోని క్లైమెట్‌ రిసర్చ్‌ యునిట్‌ డైరెక్టర్‌ టిమ్‌ ఆస్‌బోర్న్‌ తెలిపారు. ఆ తర్వాత తమ విభాగం మరింత కచ్చితత్వంతో భూతాపోన్నతని అంచనా వేస్తూ వస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular