fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsసినీ నిర్మాణం లోకి అడుగుపెడుతున్న 'అలీ'

సినీ నిర్మాణం లోకి అడుగుపెడుతున్న ‘అలీ’

ComedianAli TurnedAs ProducerForMovie

టాలీవుడ్: తెలుగు సినిమా అభిమానులకి ‘అలీ‘ అంటే తెలియని వారుండరు. బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సుమారు 40 సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. హాస్య నటుడిగా, హీరోగా, ప్రత్యేక పాత్రల్లో మరియు వ్యాఖ్యాత గా, ఈ మధ్య రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన అలీ ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగం లో కూడా తన సత్తా చాటాలనుకుంటున్నాడు. ‘అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్’ అనే సొంత బ్యానర్ స్థాపించి ఒక సినిమా మొదలుపెట్టాడు. ఈ బ్యానర్ ద్వారా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమాని ప్రారంభించాడు. ఈ సినిమాకి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మలయాళంలో రూపొందిన ‘వికృతి’ అనే సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. గీత గోవిందం లో విజయ్ చెల్లి గా నటించిన మౌర్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు ఈ సినిమాలో పవిత్ర లోకేష్, డమరుకం విలన్ రవి శంకర్ కూడా నటిస్తున్నారు. తాను అడుగుపెట్టిన అన్ని రంగాల్లో విజయం సాధించిన అలీ ఇందులో కూడా విజయం సాధించాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular