fbpx
Wednesday, December 25, 2024
HomeAndhra Pradeshపీఎస్‌ఎల్వీ సీ-50 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్వీ సీ-50 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

ISRO-LAUNCH-PSLV-C-50-SUCCESSFULLY

సూళ్లూరుపేట: ఏపీ నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేలా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.

దేని ద్వారా సీఎంఎస్‌-01 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు ఈ సీఎంఎస్‌-01 ఉపయోగ పడనుంది. ఇది ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్‌-12 స్థానాన్ని సీఎంఎస్‌-01 శాటిలైట్‌ భర్తీ చేయనుంది. సీఎంఎస్‌ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయ మార్గంగా మారింది.

చంద్రయాన్, మంగళ్‌యాన్‌ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ్వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్‌ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular