బాలీవుడ్: మలయాళం ఇండస్ట్రీ నుండి సినిమాల్లోకి పరిచయం అయ్యి సౌత్ లో అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా. మలయాళం లో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకి ధీటుగా షకీలా సినిమాలు ఆడేవి. ప్రస్తుతం షకీలా జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందుతుంది. ఈ సినిమాని ‘షకీలా’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా నటిస్తుంది. మరో ముఖ్యమైన పాత్రలో పంకజ్ త్రిపాఠి నటిస్తున్నాడు. ఈ సినిమాని క్రిస్టమస్ సందర్భంగా హిందీ తో పాటు మరి కొన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు.
ట్రైలర్ లో సినిమాలకి రాకముందు షకీలా జీవితం ఎలా ఉండేది ఎలాంటి పరిస్థితుల వల్ల షకీలా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది తర్వాత ఎందుకు కేవలం రొమాంటిక్ సినిమాలని పరిమితం అయింది లాంటి అంశాలని టచ్ చేసినట్టు అనిపించింది. సమ్మీ నన్వాని నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సిల్క్ స్మిత బయోపిక్ గా రూపొందిన ‘డర్టీ పిక్చర్’ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు అని అనిపించింది. అంతే కాకుండా ఈ సినిమా కథ రియాలిటీ కి దూరంగా ఫిక్షన్ ఎక్కువ జోడించి తీసినట్టు కూడా విమర్శలు వస్తున్నాయి.