ముంబై: యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఆడ్-అన్స్ ఉపయోగిస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వీడియోల కోసం, ఇతర అవసరాల కోసం ఆడ్-అన్స్ ను గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ల నుండి డౌన్లోడ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అలాంటి ఒక 28 ఆడ్-అన్స్ వరకు మాల్వేర్ సోకినట్లు ఇటీవల గుర్తించబడ్డాయి. యూజర్లను అసురక్షితమైన వెబ్‌సైట్‌లకు ఈ ఆడ్-అన్స్ మళ్లిస్తున్నట్లు కనుగున్నారు. దీని ద్వారా ఇమెయిల్ చిరునామాలు, మొబైల్ నంబర్స్, బ్యాంక్ కార్డ్ సమాచారం వంటి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు తస్కరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీటి ద్వారా సుమారు 3 మిలియన్ల మంది ప్రభావితమై ఉండవచ్చని భద్రతా సంస్థ అవాస్ట్ తన నివేదికలో పేర్కొంది.
ఇలాంటి ఆడ్ ఆన్స్ ద్వారా లాగిన్ సమయం, పరికరం పేరు, ఆపరేటింగ్ సిస్టమ్, ఉపయోగించిన బ్రౌజర్, వెర్షన్, ఐపీ చిరునామాలతో సహా యూజర్ పుట్టిన తేదీలు, ఇమెయిల్ చిరునామాలు వంటి డేటా మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్తుంది. అలాగే వినియోగదారు యొక్క సుమారు లొకేషన్ హిస్టరీ తెలుసుకోవడానికి సహాయపడుతున్నట్లు” అవాస్ట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కాబట్టి జాగ్రత్త వహించాలని అవాస్ట్ కోరింది.