హాలీవుడ్: హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ సినిమాలు ఎంత ప్రసిద్ధి అనే విషయం తెల్సిందే. అలాంటి మార్వెల్ సిరీస్ లో ‘అవెంజర్స్’, ‘కెప్టెన్ అమెరికా – వింటర్ సోల్జర్’ లాంటి సినిమాలని రూపొందించిన దర్శక ద్వయం రూసో బ్రదర్స్ దర్శకత్వం లో ధనూష్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ ఇవాల ధనూష్ అధికారికంగా ట్విట్టర్ లో తెలియచేసాడు. నెట్ ఫ్లిక్స్ రూపొందించనున్న ‘గ్రే మాన్’ అనే సినిమాలో ధనూష్ నటించబోతున్నాడు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ ఈ సినిమాని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమ్ చేయబోతున్నారు.
కెప్టెన్ అమెరికా నటుడు క్రిస్ ఎవాన్స్ మరియు మరో హాలీవుడ్ నటుడు ర్యాన్ గోస్లింగ్ (లా లా ల్యాండ్ ఫేమ్) లతో పాటు ఈ సినిమాలో ధనూష్ నటించనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసాడు ధనూష్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాన్స్ అందరికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియచేసాడు. ధనుష్ ప్రస్తుతం జగమే తంత్రం అనే తమిళ్ సినిమాలో మరియు అక్షయ్ కుమార్ తో కలిసి హిందీ లో ‘ఆత్రాంగి దే’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఇలా సౌత్, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం సాగిస్తున్నాడు ధనూష్. అంతే కాకుండా సౌత్ నుండి హాలీవుడ్ సినిమాల్లో నటించిన ఏకైన హీరో గా ధనూష్ కి గుర్తింపు ఉంది. ఇంతకముందు ‘ఎక్స్ట్రా ఆర్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించాడు.