టాలీవుడ్: సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. అన్ని హంగులు పూర్తి చేసుకొని డిసెంబర్ 25 న ఈ సినిమా థియేటర్ లలో విడుదల అవనుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీ గా నభ నటేష్ నటిస్తుంది. పెళ్లి, రిలేషన్ షిప్ అంటే పడని అబ్బాయిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. చిన్నప్పటి నుండి తేజ్ మామయ్య రావు రమేష్ ఆలా పెంచుతాడు. పెద్దయ్యాక కూడా పెళ్లి లాంటి స్వేచ్ఛలేని జీవితం లేకుండా సోలో బ్రతుకే సో బెటర్ అనే నినాదం తో ముందుకు పోతుంటాడు. బాచిలర్ అయిన ‘ఆర్ నారాయణమూర్తి‘ నే హీరో ఆదర్శంగా తీస్కుని ముందుగు వెళ్తుంటాడు. అలాంటి వ్యక్తి జీవితం లోకి ఒక అందమైన అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా టర్న్ అయింది అనేది వినోదాత్మక ధోరణిలో ఈ సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్ తో అర్ధం అవుతుంది.
ఈ మధ్యనే థియేటర్ లు తెరుచుకున్నాయి కానీ ఇప్పటివరకు గుర్తింపు ఉన్న సినిమా ఏదీ విడుదల అవలేదు. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో ఆ రిస్క్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆదరణ థియేటర్ లలో ఎలా ఉంటుంది అనే దాని పైన తర్వాత వచ్చే సినిమాలు ఆధారపడి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ప్రస్తుతం గేమ్ చెంజర్ పోసిషన్ లో ఉంది. ఒక వేల ఈ సినిమాకి థియేటర్ లలో ఆదరణ ఘనంగా లభిస్తే ఇక సంక్రాతి కి చాలా సినిమాలు విడుదల అవుతాయి. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బివీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి థమన్ అందించిన సంగీతం ఇప్పటికే సూపర్ హిట్ అయింది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న ఈ సినిమా హిట్ అయ్యి ఎన్నో సినిమాలకి దారి చూపివ్వాలని ఆశిద్దాం.