హైదరాబాద్: వంద రోజులుగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నిన్ననే అట్టహాసంగా ముగిసింది. 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అయ్యి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో కలిపి మొత్తం 19 మంది ఈ సీజన్ లో పాల్గొన్నారు. చివరి వారం లో అయిదుగురు కంటెస్టెంట్ లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ చివరకి ఒకరిని విన్నర్ గా ఎంచుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే తన వ్యక్తిత్వం తో అందర్నీ ఆకట్టుకున్న మిస్టర్ కూల్ అభిజీత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాల్లకి ఎవరికీ వాళ్లే మేము గెలుస్తాం అని బాగా నమ్మకంగా ఉన్నారు. కానీ బయట పరిస్థితి మొత్తం వేరే గా ఉంది, అభిజీత్ కి ఫుల్ ఓట్లు పడ్డాయి. పడిన ఓట్లలో దాదాపు 50 శాతం అభిజీత్ కే పడ్డాయని చెప్తున్నారు.
సీజన్ ప్రారంభం అయినప్పటినుండి అభిజీత్ కి హౌస్ లో కొంత సపోర్ట్ లేనప్పటికీ బయట మాత్రం అభిజీత్ ఫాలోయింగ్ మాత్రం అంతకంతకు పెరిగింది. ప్రతి స్టేజి లో అభిజీత్ తన వ్యక్తిత్వాన్ని బట్టే ముందుకు వెళ్ళాడు కానీ ఎక్కడా కూడా తన లిమిట్స్ దాటి ప్రవర్తించలేదు. ఎక్కడా ఎంతవరకు ఎలా బెహేవ్ చెయ్యాలో అలా చేసుకుంటూ వెళ్లి అభిమానుల మనసు గెలిచాడు. చివరకి బిగ్ బాస్ కూడా అభిజీత్ లాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ కి రావడం బిగ్ బాస్ కి గర్వకారణం అని చెప్పి అభిజీత్ గొప్పతనాన్ని తెలిపారు.
చివరగా అభిజీత్ మరియు అఖిల్ టైటిల్ పోరులో నిలిచారు. మెగాస్టార్ ముఖ్య అతిధి గా విచ్చేసి అందర్నీ అలరించాడు. ప్రతి ఒక కంటెస్టెంట్ గురించి కొంత మాట్లాడి అందర్నీ అలరించాడు. చివరగా నాగార్జున విన్నర్ అభిజీత్ ని ప్రకటించి చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ ప్రెసెంట్ చేసారు. స్టేజి పైన చిరంజీవి కొంత మంది కంటెస్టెంట్స్ కి కొన్ని వరాలు ప్రకటించాడు. ఒక కంటెస్టెంట్ దివి కి తన తీయబోయే ‘వేదాళం’ రీ-మేక్ సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు. సోహెల్ చేయబోయే సినిమాకి అతిధి గా వచ్చి ప్రొమోషన్ చేస్తానని వీలయితే ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తానని కూడా ప్రకటించాడు.