fbpx
Thursday, January 16, 2025
HomeNationalపార్టీ మారినందుకు భార్యకు విడాకులిస్తానన్న బీజేపీ ఎంపీ

పార్టీ మారినందుకు భార్యకు విడాకులిస్తానన్న బీజేపీ ఎంపీ

SUJATHA-MONDAL-QUITS-BJP-HUSBAND-TO-DIVORCE

న్యూఢిల్లీ : వెస్ట్ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్‌ భార్య అయిన సుజాతా మండల్‌ ఖాన్‌ సోమవారం నాడు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. బెంగాల్‌లోని బిష్ణూపూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్‌ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడి పదవిలో ఉన్నారు. కోల్‌కతాలో టీఎంసీ నాయకులు సౌగతా రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ సమక్షంలో సుజాతా ఖాన్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్‌ ఖాన్‌ ఆరోపించారు. పార్టీకి ఎప్పటి నుంచో విధేయురాలిగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు.

బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదో ఒక రోజు వాస్తవాలను గుర్తించి ఆయన కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిపోవచ్చని ఆమె చెప్పారు. ఈ విషయమై సౌమిత్రా ఖాన్‌ను ప్రశ్నించగా, సుజాతా ఖాన్‌ పార్టీ మారినందున తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పారు. ఇక ముందు తన భార్య తన సర్‌ నేమ్‌ను వాడుకోరాదని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular