ముంబై: ఒప్పో స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇండియాలో తన తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ ను ఏర్పాటు చేయబోతోంది. చైనా తరువాత , భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ తొలి 5జీ ల్యాబ్ నెలకొపనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
నూతన ఆవిష్కరణలతో పాటు, భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా మార్చే లక్ష్యంలో భాగంగా మరో మూడు ఫంక్షనల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ఆలోచిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో తమ రీసెర్చ్, డెవలప్‌మెంట్ కేంద్రంలో 5జీ ఇన్నేవేషన్ ల్యాబ్‌ను ఆవిష్కరించనున్నామనీ, చైనా తరువాత విదేశాల్లో ఇది మొదటిదని ఒప్పో తెలిపింది. తద్వారా 5 జీ యుగానికి కోర్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, మొత్తం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా ఇండియా 5జీ ప్రయాణంలో మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్, హెడ్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ తస్లీమ్ ఆరిఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.