వాషింగ్టన్: మెసేజింగ్ యాప్ లలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన వాటిలో వాట్సాప్ ది మొదటి స్థానం. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ వరుసగా అనేక అప్‌డేట్లు తీసుకొస్తోంది. ఇదివరకు చాట్ వాల్ పేపర్స్, మ్యూట్ ఆల్వేస్, గ్రూప్ వీడియో కాల్స్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది.
2021లో వాట్సాప్ ఇంకా ఇలాంటి ఎన్నో సరికొత్త ఫీచర్స్ తీసుకురావాలని భావిస్తోంది. వాట్సాప్ యూజర్లు వచ్చే ఏడాదిలో రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరించాలని పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఒకవేల ఎవరైతే ఈ నిబంధనలను అంగీకరించారో వారు వాట్సాప్ ఖాతాని తొలిగించనున్నట్లు పేర్కొంది.
మొబైల్ వాట్సాప్ వినియోగదారులు వాడుతున్న ఆడియో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్ లను వచ్చే ఏడాదిలో వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం కూడా తీసుకుని వచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. వాబీటాఇన్ఫో ప్రకారం, వాయిస్ కాలింగ్, వీడియో కాల్ ఫీచర్ లు డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
ఆపిల్ ఐఓఎస్ వినియోగదారుల కోసం పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ని వచ్చే ఏడాదిలో తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్ లో భాగంగా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం మల్టీపుల్ ఐటమ్స్ ని ఎంచుకొని ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి టాప్ చేసి తర్వాత ‘కాపీ’ చేయాలి. ఇప్పుడు ఆ ఐటమ్స్ ని మీకు నచ్చిన వారికే ఒకేసారి పంపించవచ్చు.