న్యూ ఢిల్లీ : MHA మార్గదర్శకాల ప్రకారం, రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులందరికి తప్పనిసరిగా స్క్రీనింగ్ చేస్తారు. COVID-19 లక్షనాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతించబడతారు.
హైలైట్స్:
- జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే 200 రైళ్లలో 1వ రోజు ప్రయాణించడానికి 1.45 లక్షలకు పైగా ప్రయాణికులు
- ప్రయాణీకులందరు 90 నిమిషాల ముందుగానే రైల్వే స్టేషన్కు చేరుకోవాలి
- ధృవీకరించబడిన/ఆర్‌ఏసి టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి రైలు ఎక్కడానికి అనుమతి ఉంది
రైల్వే శాఖ ఈరోజు పాక్షికంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో, రోజుకు 200 రైళ్లలో 1.45 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణించనున్నారు. రైలు సర్వీసుల పునరుద్ధరణలో ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా, రైల్వే ఈరోజు (జూన్ 1) నుండి ప్రస్తుతం ఉన్న ష్రామిక్ స్పెషల్ రైళ్లు మరియు స్పెషల్ ఎసి రైళ్లతో పాటు అదనంగా 200 రైళ్లను ప్రారంభిస్తుంది.
ఆదివారం ఉదయం 09.00 గంటల సమయానికి మొత్తం బుకింగ్గ్స్ 25,82,671 చేరుకున్నాయి. ఈ రైళ్లకు టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్‌లో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా జరుగుతోంది. 2020 మే 22 నుండి రిజర్వేషన్ కౌంటర్లు, కామన్ సర్వీస్ సెంటర్లు (సిఎస్సి) మరియు టికెటింగ్ ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసుకోవడానికి రైల్వే అనుమతి ఇచ్చింది.