టాలీవుడ్: ప్రొడ్యూసర్స్ వివిధ కాంబినేషన్స్ లో సినిమాలు ప్రకటిస్తూ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెల్తూ పోతూ ఉంటారు. కానీ ఒకే నిర్మాత దగ్గరి నుండి 5 సినిమాలు ఒకే సారి సెట్ లో ఉండడం చాలా అరుదైన విషయం. అంతే కాకుండా అది చిన్న నిర్మాతలకి సాధ్యపడని పని. అందులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉండడం విశేషం. కరోనా కారణంగా ఇన్ని రోజులు షూటింగ్స్ కి బ్రేక్ వేసి అన్ని సినిమాలు ఒకేసారి షూటింగ్ మొదలు పెట్టడం తో ప్రొడ్యూసర్స్ కి కొంచెం భారం అయినా కూడా పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ముందు పూర్తి చేసి సమయం దొరికినప్పుడు విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు.
ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న ‘వకీల్ సాబ్’, ‘విక్టరీ వెంకటేష్’ మరియు వరుణ్ తేజ్ నటించనున్న ‘F3 ‘ , నాగ చైతన్య తో ‘థాంక్ యు’ , విశ్వక్ సేన్ తో పాగల్ మూవీ అలాగే హుషారు డైరెక్టర్ తో పేరు ప్రకటించని ఒక సినిమా.. ఇలా 5 సినిమాలు తన నిర్మాణంలో ప్రస్తుతం సెట్ లో ఉన్నవి. ఇలాంటి విషయం మామూలు చిన్న నిర్మాతలకి సాధ్యపడని విషయం. వీటితో పాటు దిల్ రాజు మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అంతే కాకుండా ‘జెర్సీ’ సినిమా రీమేక్ తో హిందీ లో కూడా అడుగు పెడుతున్నాడు. వచ్చే సంవత్సరం దిల్ రాజు గారి బ్యానర్ నుండి రెండంకెల సినిమాలు వచ్చినా ఆశ్చర్య పడాల్సింది లేదు.