టాలీవుడ్: ‘మళ్ళీ రావా’ లాంటి క్లాసికల్ లవ్ స్టోరీ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలని రూపొందించి ఇండస్ట్రీ కి కొత్త రకమైన సబ్జక్ట్స్ తో బ్లాక్ బస్టర్ సినిమాలని అందించిన ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ ప్రస్తుతం మరొక కొత్త జానర్ సినిమాతో రాబోతుంది. ‘మాసూద’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవాల విడుదల చేసారు. తమ ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఇంతముందు సినిమాల లాగానే ఈసారి కూడా కంటెంట్ ని నమ్ముకునే ముందడుగు వేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా ద్వారా సాయి కిరణ్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.
జార్జి రెడ్డి సినిమాలో లలన్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ‘తిరువీర్‘ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. గంగోత్రి సినిమాలో బాల నటిగా నటించిన ‘కావ్య కల్యాణ్ రామ్’ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని ఇవాల విడుదల చేసారు. స్వధార్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. మరి కొద్దీ రోజుల్లో మిగతా వివరాలతో పాటు సినిమాకి సంబందించిన ప్రొమోషన్ కూడా ప్రారంభించనున్నారు.