టాలీవుడ్: కెరీర్ ప్రారంభం లో వరుస హిట్లు కొట్టి తర్వాత వరుస ప్లాప్ లతో డీలాపడిన హీరో సాయి ధరమ్ తేజ్. ‘చిత్ర లహరి’ , ‘ప్రతి రోజు పండగ’ లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మళ్ళీ పుంజుకుని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ హీరో నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రేపే థియేటర్లలో విడుదల అవుతుంది. దీంతో పాటు ‘దేవా కట్ట’ దర్శకత్వం లో రాబోతున్న ఒక సూపర్ యాక్షన్ డ్రామా లో నటిస్తున్నారు ఈ హీరో. ఇదే కాకుండా ఈరోజు మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాని నిర్మించిన బివీఎస్ఎన్ ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై కొత్త సినిమా కూడా నిర్మిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా సుకుమార్ అందించనున్నాడు. ‘భమ్ బోలేనాథ్’ సినిమాకి దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ రోజు షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో 15 వ సినిమాగా రాబోతుంది.