fbpx
Sunday, October 27, 2024
HomeBig Storyఇంగ్లండ్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు

ఇంగ్లండ్ లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు

ENGLAND-CORONA-CASES-RISING-ALARMING-SPEED

జొహన్నెస్‌బర్గ్‌: కరోనా మహమ్మారి యొక్క‌ కొత్త వేరియంట్‌ ఇంగ్లాండ్‌లో శరవేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కొత్త రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌) తెలిపిన గణాంకాల ప్రకారం, ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు వారం రోజుల్లో 1,73,875 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే డిసెంబర్‌ 17 నుంచి 24వ తేదీ దాకా ఏకంగా 2,75,310 కేసులు నమోదయ్యాయి.

ఇంగ్లాంద్ లో ఒక్క వారం రోజుల్లోనే ఇన్ని కొత్త కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) మొత్తం వ్యాప్తంగా కరోనా వ్యాప్తి అధికంగానే ఉందని ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) వెల్లడించింది. వేల్స్‌లో పరిస్థితి ఎల ఉందంటే, ప్రతి 60 మందిలో ఒకరికి, ఇంగ్లాండ్‌లో ప్రతి 85 మందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నాయని తెలియజేసింది. కరోనా కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో యూకే ప్రభుత్వం కీలకమైన ప్రాంతాల్లో టైర్‌–4 ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితుల వల్ల రాణి ఎలిజబెత్‌–2 ఈ సారి క్రిస్మస్‌ వేడుకలను కేవలం తన భర్త ఫిలిప్‌తో మాత్రమే కలిసి జరుపుకున్నారు. కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్, మనవడు విలియమ్స్‌ వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికాలోనూ 501.వీ2 అనే వేరియంట్ ఒకటి కొత్తగా‌ బయటపడింది. అయితే, దక్షిణాఫ్రికాలోని వేరియంట్‌ మరింత ప్రమాదకరమని, ఇది అత్యధిక వేగంతో వ్యాపించే అవకాశాలున్నాయని బ్రిటిష్‌ ఆరోగ్య శాఖ మంత్రి వెలినీ ఖిజే ప్రకటించారు. ఈ ప్రకటనను దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి ఖండించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular