టాలీవుడ్: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన నటుడు నవీన్ పోలిశెట్టి ఆతర్వాత మహేష్ బాబు ‘1 ‘ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిశాడు. అప్పటి నుండి యు ట్యూబ్ లో చాలా వీడియోలు చేసి బాలీవుడ్ సైడ్ కూడా ప్రయత్నాలు చేసాడు. 2019 లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మరియు బాలీవుడ్ లో ‘చిచోరే’ సినిమాల ద్వారా హిట్ సాధించి అందరి కళ్ళలో పడ్డాడు. చిచోరే సినిమాలో చాలా మంది యాక్టర్స్ ఉన్నా కూడా నవీన్ పోలిశెట్టి ఆ సినిమాలో స్పెషల్ గా నిలిచాడు. ఆ తర్వాత తెలుగులో ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు ఎపుడో పూర్తి అయినప్పటికీ కరోనా వల్ల విడుదల ఆలస్యం అయింది.
ఈరోజు నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి నవీన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ పేరుతో ఒక చిన్న వీడియో విడుదల చేసారు. అంతే కాకుండా ఒక పోస్టర్ కూడా విడుదల చేసారు. నవీన్ జైలు లో కూర్చొని విడుదల ఎప్పుడయ్యా అని ఒక ప్రశార్ధకం పెట్టి వొదిలేసారు. అంటే ఇది సినిమాకి వర్తిస్తుంది అలాగే ఆ పోస్టర్ లో జైలు లో ఉన్న క్యారెక్టర్ కి కూడా వర్తిస్తుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి జోగిపేట శ్రీకాంత్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ కామెడీ తో రానుందని వీడియో చూస్తే అర్ధం అవుతుంది. నవీన్ టైమింగ్ గురించి, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దానికి తోడు ఈ సినిమాలో నవీన్ తో పాటు ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ జాతిరత్నాలుగా నటిస్తున్నారు. ఇంకా కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అనుదీప్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.