కోలీవుడ్: కరోనా కారణంగా విడుదల వాయిదా పడ్డ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పెద్ద హీరో సినిమా ‘మాస్టర్’. దళపతి విజయ్ మరియు విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ సినిమా 2019 ఏప్రిల్ లోనే విడుదల అవ్వాల్సింది. సరిగ్గా అదే టైం కి లాక్ డౌన్ విధించడం తో ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తుంది. మధ్యలో ఓటీటీ విడుదల అంటూ రూమర్స్ వచ్చినా కూడా నిర్మాతలు మాత్రం థియేటర్ లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఇపుడు థియేటర్లు తెరచుకుని జనాలు థియేటర్లకు వస్తుండడం తో ఈ సినిమా విడుదల గురించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీ ని ప్రకటించారు.
ప్రస్తుతం ఈ సినిమాని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమాని జనవరి 13 న విడుదల చేస్తున్నారు. హిందీ బాషలో మాత్రం జనవరి 14 న విడుదల చేస్తున్నారు. ఖైదీ సినిమాని రూపొందించిన లోకేష్ కానగరాజ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పైన అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ కి జోడీ గా మాళవిక మోహనన్ నటిస్తున్నారు. ఇప్పటికి విడుదలైన సినిమా పాటలు బాగా ఆకట్టుకున్నాయి. పాటలు మరియు టీజర్ లో వినిపించిన బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా అనిరుద్ మరోసారి రాక్ స్టార్ అని నిరూపించుకున్నాడు.