టాలీవుడ్: ఈ సంవత్సరం కరోనా వచ్చి పెద్దగా సినిమాలు విడుదల అవనప్పటికీ ఒక హీరోయిన్ మాత్రం వరుసగా సినిమాలు లైన్ లో పెట్టింది. ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల అవకముందే యువ హీరోలతో సినిమాలకి సంతకం చేసి షూటింగ్ లలో బిజీగా గడుపుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ‘కృతి శెట్టి’. మెగా హీరో వైష్ణవ తేజ్ కి జోడీ గా ఉప్పెన సినిమాతో ఈ హీరోయిన్ పరిచయం అవుతుంది. అన్నీ కుదిరితే ఈ సంవత్సరం మార్చ్ చివర్లో ఈ సినిమా విడుదల అవ్వాలి కానీ లాక్ డౌన్ వాల్ల ఇంకా ఈ సినిమాకి మోక్షం లభించలేదు. అయినప్పటికీ ఈ మలయాళీ హీరోయిన్ మంచి సినిమాల ఆఫర్ లు కొట్టేసింది. ఇప్పటివరకు ఉప్పెన సినిమా నుండి విడుదలైన టీజర్స్, సాంగ్స్ లో కృతి శెట్టి స్క్రీన్ ప్రెజన్స్ మరియు అభినయం ఆకట్టుకుంది.
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ‘శ్యామ్ సింఘరాయ్’ లో ఈ హీరోయిన్ ఆఫర్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. సుధీర్ బాబు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో రాబోతున్న హ్యాట్రిక్ కాంబో సినిమాలో కూడా ఈ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఒక సింపుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా మరి కొద్దీ రోజుల్లో షూటింగ్ మొదలవబోతుంది. ఇది కాకుండా గోపీచంద్ మరియు తేజ దర్శకత్వం లో రాబోతున్న సినిమాలో కృతి నటించనున్నట్టు ఒక వార్త ఉంది. ఇంకా తమిళ్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ ఉంది. ఇలా ఒక్క సినిమా కూడా విడుదల అవకముందే తెలుగులో ఇప్పటికే ఇద్దరు మంచి ఫేమ్ ఉన్న హీరోల సినిమాలు చేస్తుండడం తో ఈ హీరోయిన్ ని ఈ సంవత్సరం ఎమర్జింగ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్ 2020 గా ఎంచుకున్నాం.