హైదరాబాద్: మా దిటూస్టేట్స్.కాం పాఠకులకు, శ్రేయోభిలాషులకు మరియు మిత్రులందరికీ మా అందరి తరపున 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వార్తలను చదువుతూ మా పోర్టల్ అభివృద్ధికి సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు.
2020 సంవత్సరానికి వీడ్కోలు పలికే వేళ మనకు గత సంవత్సరం మిగిల్చిన కరోనా అనే పీడకలను ఇక్కడే వదిలేసి అందరం 2021 సంవత్సరానికి నూతన ఆశలతో, లక్ష్యాలతో ముందుకు వెళదాం.
ఈ నూతన సంవత్సరం కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించే దిశగా నిరంతరం శ్రమిస్తూ, జీవితాన్ని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అనుభవిస్తూ విజయంతో ఈ సంవత్సరం అంతా సాఫీగా సాగాలని మరోసారి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.