టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పౌరాణికాల్ని కొంచెం మంచిగా హేండిల్ చెయ్యగల దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. తన కెరీర్ మొదట్లోనే బాల రామాయణం తీసి మంచి ప్రశంసలు పొందాడు. ఈ మధ్యనే రుద్రమదేవి సినిమా తీసి కంటెంట్ పరంగా బాగుందని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత దగ్గుబాటి రానా తో ‘హిరణ్య కశ్యప’ ప్రకటించారు కానీ కొన్ని కారణాల వలన అది ప్రారంభం అయ్యేలోపు ‘శాకుంతలం’ అనే మరొక సినిమా ప్రకటించాడు. ఇది కూడా కొంచం పురాణాల్ని దృష్టిలో పెట్టుకుని రాసిన ఫిక్షన్ కథ అని గుణ శేఖర్ ఇదివరకే తెలిపారు.
ఈ ‘శాకుంతలం’ అనే సినిమా పూర్తి లేడీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అనే సస్పెన్స్ కొద్దిరోజులు కొనసాగింది. ఆ తర్వాత ‘పూజ హెగ్డే’ అని ‘అనుష్క’ అని ‘సమంత’ అని ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే ఇవాల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుణ శేఖర్ ఈ సినిమా కావ్యనాయిక ‘సమంత’ అని అధికారికంగా ప్రకటించాడు. కాళిదాసు రచించిన శకుంతలాన్ని ఈ సినిమా ద్వారా గుణ శేఖర్ ప్రెసెంట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాని గుణ శేఖర్ తన సొంతర్ బ్యానర్ గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం చేస్తున్నాడు.