టాలీవుడ్: టాలీవుడ్ ఫామిలీ హీరో జగపతి బాబు హీరోగా ఎన్నో ఫామిలీ సినిమాలు చేసి బాలయ్య లెజెండ్ సినిమా ద్వారా విలన్ పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అప్పటి నుండి జగపతి బాబు ప్రతీ సినిమా ద్వారా ఆకట్టుకుంటున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఎక్కువ పేరు తో పాటు ఎక్కువ సంపాదన కూడా ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం జగ్గూ భాయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. జగపతి బాబు ఒక తండ్రి పాత్రలో ‘FCUK’ (ఫాదర్ – చిట్టి – ఉమ – కార్తీక్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం కామెడీ తో ఆకట్టుకుంది.
ఈ సినిమాలో వయసులో ఉన్న ఒక కొడుకుకి తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు. తన ఇంటికి కోడలు తీసుకొచ్చి మనవల్ని ఎత్తుకోవాల్సిన వయసులో తాను అమ్మాయిలని పడేసి తన కూతుర్ని ఇంటికి తీసుకొస్తాడు. ఈ సినిమాలో తండ్రి కొడుకులు ఇద్దరు అమ్మాయిల వెంట పడే పాత్రల్లో నటించారు. కానీ ఇదంతా వల్గర్ గా కాకుండా కామెడీ గా చూపించి ఆకట్టుకున్నారు డైరెక్టర్. అలాంటి ఈ తండ్రి కొడుకుల లైఫ్ లోకి ఒక డాక్టర్ వచ్చి వీళ్ళ లైఫ్ ఎలా మార్చింది అనేది మిగతా కథ అని అనిపిస్తుంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్. దామోదర్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా విడుదలవుతున్న ఈ సినిమాకి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఈ జనవరి లోనే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.