టాలీవుడ్: ‘రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా పరిచయం అయిన హీరో ‘కిరణ్ అబ్బవరం’. మొదటి సినిమా పరవాలేదనిపించినా కానీ ఈ హీరో వరుస సినిమాలు ప్రకటిస్తూ షూటింగ్ లతో బిజీ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో ‘SR కల్యాణ మండపం’ మరియు ‘సెబాస్టియన్ PC 524 ‘ అనే రెండు సినిమాలు షూటింగ్ ముగించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలు పూర్తి అవకముందు మరొక సినిమాని ప్రకటించి దూకుడు చూపిస్తున్నాడు. ఈ రోజు తాను తియ్యబోయే నాల్గవ సినిమా అంనౌన్స్మెంట్ తో పాటు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేసారు. ఈ సినిమాని ‘సమ్మతమే’ అనే పేరు తో రూపొందిస్తున్నారు.
ఈ మధ్యనే కలర్ ఫోటో తో సూపర్ సక్సెస్ సాధించిన ‘చాందిని చౌదరి‘ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. టైటిల్ పోస్టర్ మంచి క్లాస్ కలర్స్ తో ఉండి ‘unconditional love ‘ అనే టాగ్ జత చేసారు. ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ని అభిమానులకి ప్రెసెంట్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు మేకర్స్. UG ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే. ప్రవీణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘నచ్చావులే’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం గోపినాథ్ రెడ్డి అనే నూతన దర్శకుడు చేస్తున్నాడు.