టాలీవుడ్: సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్ లు సెట్ అయ్యాక వాళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమాలకి కొన్ని అంచనాలు ఏర్పడతాయి. ఇప్పటికి సుధీర్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా పరవాలేదని పించాయి. ‘సమ్మోహనం’ సినిమా ద్వారా సుధీర్ బాబు తో ఒక క్లాస్ లవ్ స్టోరీ రూపొందించిన ఇంద్రగంటి ‘వీ’ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని తో కలిసి నటించాడు . వీరిద్దరూ కలిసి మూడవసారి ఒక సినిమాకి పని చేయనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది.
‘ఉప్పెన’ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్న నటి ‘కృతి శెట్టి’. ఒక్క సినిమా కూడా విడుదల అవకముందు మూడు నాల్గు సినిమాలని లైన్ లో పెట్టింది ఈ హీరోయిన్. ఈ సినిమాలో కూడా ఈ అమ్మాయి హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాని ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ లా తీర్చి దిద్దనున్నారు. సమ్మోహనం కి సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.