కోలీవుడ్: హాలీవుడ్ లో ‘SAW ‘ సిరీస్ మూవీస్ చూసిన వారికి తెలుస్తుంది ఎంత క్రూరంగా ఉంటాయో అని. మన దేశంలో అలాంటి సినిమాలు అంత క్రూరంగా చంపడం చూపించే సినిమాలు చాలా తక్కువ ఒకవేళ ఉన్నా కూడా అలాంటివి సినిమాలో ఎక్కడో ఆలా కనిపిస్తుంటాయి. కానీ ఒక సినిమా మొదటి టీజర్ అలాంటి క్రూరమైన సీన్ తో ప్రెసెంట్ చేసారు అంటే ఇంకా ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ‘మనిషిని మించిన క్రూరమైన జంతువు ఉండదు’ అంటూ టీజర్ మొదలు పెట్టి ఆ మాట నిజం అని నిరూపించేలా టీజర్ ని ప్రెసెంట్ చేసారు. ఇదంతా నిన్న విడుదలైన ‘రాకీ’ అనే తమిళ సినిమా టీజర్ చూసిన తర్వాత వచ్చిన స్పందన.
‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకి దర్శకత్వం వహించిన విగ్నేష్ శివన్ ‘రౌడీ పిక్చర్స్’ అనే బ్యానర్ స్థాపించి తన మొదటి సినిమాగా ‘రాకీ’ సినిమాని రూపొందించాడు. వసంత్ రవి అనే నటుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో మరొక ముఖ్య పాత్రలో అలనాటి గొప్ప దర్శకుడు భారతి రాజా నటించారు. అరుణ్ మాధేశ్వరం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మోస్ట్ వైలెంట్ అని ప్రెసెంట్ చేసిన ఈ టీజర్ లో ఒక మనిషి చూస్తుండగానే ఇంకో మనిషి పీకని ఒక పాత రేకు ముక్కతో అతి కిరాతకంగా కోసి చనిపోయిన తర్వాత అతని పేగులు తీసి మేడలో వేయడం చూపిస్తారు. టీజర్ చూసిన వాళ్ళందరూ ఇంత వైలెంట్ మన సినిమాల్లో చూడలేదని చెప్తున్నారు.