టాలీవుడ్: కమెడియన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి మంచి మంచి సినిమాలు తీసి హీరోగా రూపాంతరం చెంది మొదట్లో కొన్ని హిట్లు ఇచ్చినా కూడా వరుస ప్లాప్ లు చవి చూడడం తో మళ్ళీ కమెడియన్ గా అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు సీనియర్ కమెడియన్ కమ్ హీరో సునీల్. ప్రస్తుతం సునీల్ హీరో గా ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్ తో ఒక సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ‘గబ్బర్ సింగ్’ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇచ్చిన కథతో ఈ సినిమా రూపొందుతుంది.
పవన్ కళ్యాణ్ తో ‘తొలి ప్రేమ‘ లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు ‘కరుణా కరణ్’ ఈ సినిమా మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించి షూటింగ్ ప్రారంభించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సి చంద్రమోహన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సునీల్ హీరోగా మరో సక్సెస్ అందుకొని మళ్ళీ అన్ని రకాల పాత్రల్లో బిజీ అవాలని కోరుకుందాం.