టాలీవుడ్: వరుసగా ప్లాపులు ఎదుర్కొని మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న టైం లో పూరి జగన్నాథ్ తో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అందించాడు ‘రామ్’ . అలాంటి సక్సెస్ తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా ‘రెడ్’. తమిళ్ లో రూపొంది సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఎప్పుడో షూటింగ్ ముగించి విడుదల చేద్దాం అనుకున్న సమయంలో కరోనా వాళ్ళ ఇన్నిరోజులు విడుదల వాయిదా పడింది. ఓటీటీ లో విడుదల చేస్తారు అని రూమర్స్ వచ్చినా కూడా థియేటర్లు తెరచినప్పుడే సినిమా విడుదల చేస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. విశేషం ఏంటంటే ఈ సినిమా ఏకంగా 7 భాషల్లో విడుదల అవుతుంది.
ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠి మరియు భోజ్ పూరి భాషల్లో విడుదల అవుతుంది. రామ్ తో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ‘ లాంటి సినిమాలని రూపొందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘చిత్రలహరి’ లాంటి సక్సెస్ తర్వాత కిషోర్ తిరుమల ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమాలో రామ్ కి జోడీ గా ‘మాళవిక శర్మ’ మరియు ‘అమృత అయ్యర్’ నటించారు. మరొక స్పెషల్ సాంగ్ లో హెబ్బా పటేల్ కూడా నటించారు. ఈ సినిమాలో రామ్ రెండు పాత్రల్లో నటించి మెప్పించబోతున్నాడు. అజిత్ వాలి లాంటి షేడ్స్ ఉన్న ఈ సినిమా ఆ రేంజ్ సక్సెస్ సాధించాలని ఆశిద్దాం.