టాలీవుడ్: RX100 సినిమా ద్వారా గుర్తింపు పొందిన నటుడు ‘కార్తికేయ‘. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఈ సినిమాలో శవాలని మోసుకెళ్లే బండి డ్రైవర్ పాత్రలో హీరో నటిస్తున్నాడు. ఇప్పుడున్న జెనెరేషన్ లో ఇలాంటి పాత్రలో ఎవరూ నటించింది లేదు. ఈ సినిమాలో కార్తికేయ కి జోడీ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. ఈ సినిమాలో వీళ్లిద్దరు పూర్తి డి-గ్లామర్ పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన చిన్న టీజర్ ఒకటి విడుదల చేసారు. ఇదివరకే కూడా ఈ సినిమా నుండి హీరో కారెక్టరైజెషన్ కి సంబందించిన టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఇపుడు విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాస్పిటల్ లో పని చేసే నర్స్ పాత్రలో చూపిస్తున్నారు. హీరోయిన్ వెంటపడుతూ ‘నా ఒక్కడికి తప్ప అందరికి నువ్వు సిస్టర్’ అంటూ వచ్చే డైలాగ్ దానికి హీరోయిన్ కూడా ‘నాలుగు తంతే హాస్పిటల్ లో పడితే నీకు కూడా నేను సిస్టర్ నే’ అంటూ చెప్పే డైలాగ్స్ తో టీజర్ లో ఆకట్టుకున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. జాక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని హీరో కి తల్లి పాత్రలో ఆమని నటిస్తుంది. మరి కొన్ని పాత్రల్లో మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ నటిస్తున్నారు. ఈ వేసవి లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు టీజర్ లో తెలిపారు.