టాలీవుడ్: ప్రతి సంవత్సరం సంక్రాంతి కి థియేటర్ లలో సినిమాలు విడుదల అవుతాయి. కరోనా వల్ల ఓటీటీ లు వెలుగులోకి రావడం తో ఈ సంక్రాంతి కి కొన్ని భాషల్లో వెబ్ సిరీస్, సినిమాలు కూడా విడుదలయ్యాయి. తెలుగులో అలా ‘ఆహ’ ఓటీటీ లో విడుదలైన సినిమా ‘కంబాలపల్లి కథలు – మెయిల్ (చాప్టర్ -1 ). కంబాలపల్లి అనే వూర్లో జరిగే వివిధ సంఘటనలని వివిధ భాగాలుగా (చాఫ్టర్లు) రూపొందించి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంక్రాంతి కి మొదటి చాప్టర్ ‘మెయిల్’ ని విడుదల చేసారు.
ఇప్పుడంటే కంప్యూటర్లు, లాప్ టాప్ లు ఉన్నాయి కానీ 2000 -2005 టైం లో అప్పుడప్పుడే కంప్యూటర్లు జనాలకి తెలియడం, ఊర్లలో వాటి గురించి అవేర్నెస్ రావడం అదే మొదటిది. ఈ సినిమాకి నేపధ్యం కూడా ఆ టైం ని ఎంచుకుని కంప్యూటర్ లో వచ్చే మెయిల్స్ అనే కాన్సెప్ట్ తో ఒక రెండు గంటల సినిమా తీసి విడుదల చేసారు. సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పూర్తి ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంది. కంప్యూటర్ వచ్చిన కొత్తల్లో ఊళ్లలో రిసీవింగ్ ఎలా ఉంది. కంప్యూటర్ నేర్పే వాళ్ళు ఇచ్చే బిల్డప్, అప్పటి కాలేజ్ చదువులు, ఊళ్లలో ఉండే డబ్బు కష్ఠాలు ఇవన్నీ నాచురాలిటీ కి చాలా దగ్గరగా చూపించారు. నిజంగా ఆ సంవత్సరాల్లో ఊళ్లలో ఆ సిచుయేషన్స్ లో జీవించిన వాళ్ళు ఈ సినిమాకి వెంటనే కనెక్ట్ ఐతారు. చాలా సన్నివేశాల్లో తమని తాము చూసుకుంటారు.
ఒక సింపుల్ కథని వినోదాత్మకంగా ప్రసెంట్ చేయడంలో డైరెక్టర్ ఉదయ్ గుర్రాల విజయవంతం అయ్యాడు. ఇప్పుడున్న జెనరేషన్ లో ఇలాంటి కథని అంగీకరించి మంచి క్వాలిటీ తో ఒక సినిమా రూపొందించి విడుదల చేయడంలో నిర్మాతలు స్వప్న సినిమా వాళ్ళని అభినందించాలి. ఈ సినిమాలో స్వీకర్ అగస్తి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అప్పటి పరిస్థితులకి తగ్గట్టు చూపించడంలో కెమెరామెన్ శ్యామ్ దూపాటి పని తనం కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటీనటులు. హర్షిత్ రెడ్డి అనే కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్ అనుభవం తో మొదటి సినిమాగా ఇందులో చేసాడు కానీ ప్రతీ ఎక్స్ప్రెషన్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అతను పోషించిన రవి పాత్రని చాలా మంది కనెక్ట్ ఐతారు. ఈ జెనెరేషన్ అబ్బాయి అంతకి ముందు జెనెరేషన్ పాత్ర చేయడం దాన్ని రక్తి కట్టించడం అంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమైన పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. హర్షిత్ కి జోడీ గా నటించిన గౌరీ ప్రియ కూడా బాగా నటించింది. తన మేక్ అప్, తన నటన, సంభాషణలు ఊళ్లలో ఉండే అమ్మాయిలు ఎలా ఉంటాయో అలానే అనిపించాయి. హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా ఆకట్టుకున్నారు.