fbpx
Sunday, January 19, 2025
HomeBusinessశాంసంగ్ షేర్లు ఒక్కసారిగా కుదేలు

శాంసంగ్ షేర్లు ఒక్కసారిగా కుదేలు

SAMSUNG-VICECHAIRMAN-JAILED-2.5YEARS-IN-CORRUPTION-CASE

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం అయిన శాంసంగ్‌కు సియోల్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ వైస్ చైర్మన్ జే వై లీ(52) కు అవినీతి, లంచం కేసులో రెండున్నర సంవత్సరాల జైలు శిక్షను విధించింది. మాజీ అధ్యక్షుడు పార్క్ జియున్-హే సహచరుడికి లంచం ఇచ్చారన్న ఆరోపణలను విచారించిన కోర్టు సోమవారం తమ కీలక తీర్పును ప్రకటించింది.

సుమారు 7.8 మిలియన్ డాలర్ల విలువైన అవినీతి,లంచం తీసుకోవడం, మరియు ఆదాయాన్ని దాచి ఉంచడం లాంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు విశ్వసించింది. కాగా, ఈ తీర్పుపై ఏడు రోజులలోగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి ఈ తీర్పు సందర్భంగా సూచించారు.

అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే దీనిపై ఒకసారి తీర్పు ఇచ్చినందున, మళ్ళీ తీర్పును సమీక్షించే అవకాశాలు చాలా తక్కువ అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే లీ ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలాన్ని పరగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంసంగ్‌ షేర్లు ఒక్కసారిగా 4 శాతం వరకు పడిపోయాయి. అలాగే శాంసంగ్‌ సీ అండ్‌ టీ, శాంసంగ్‌ లైఫ్ ఇన్సూరెన్స్, శాంసంగ్‌ ఎస్‌డీఐ లాంటి వంటి అనుబంధ సంస్థల షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular