టాలీవుడ్: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలని వెంటపెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. వాటి పైన సినిమాలు తీస్తూ, తీసిన సినిమాల ద్వారా వివాదాలు క్రియేట్ చేస్తూ వాటిని చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతాడు అలాగే ఆ సినిమాలని క్యాష్ చేసుకుంటాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ కి ఒక ప్రొడ్యూసర్ దొరికితే ఆ ప్రొడ్యూసర్ తో వరుసగా ఒక రెండు మూడు సినిమాలు తీసేస్తూ ఉంటాడు. ‘D కంపెనీ‘ అనే సినిమా నిర్మిస్తున్న ‘స్పార్క్’ కంపెనీ వారితో మరొక వెబ్ సిరీస్ తియ్యబోతున్నాడు వర్మ. దాని పేరే ‘ఇది మహాభారతం కాదు’. ‘టైటిల్ లోనే పిచ్చ క్లారిటీ గా చెపుతున్నా.. దీని గురించి మానవతా వాదులు, మత తత్వ వాదులు అరచి గోల పెట్ట కండి.. ఇది మహాభారతం కాదు’ అని చెప్పుకొచ్చాడు.
మహాభారతం లో జరిగిన మోసం, జూదం, మానభంగాలు, ఆస్తి గొడవలు, యుద్దాలు, చంపుకోవడాలు ప్రప్రంచంలో ఎప్పుడూ ఎదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. మనిషి మనుగడ ఈ భూమి మీద ఆగిపోయేంతవరకి అది అలానే కొనసాగుతుంది అని ఒక ఆడియో ద్వారా తెలిపాడు. తెలంగాణ లోని ఒక గ్రామంలో మహాభారతం లో ఉన్నటువంటి పాత్రలు, మహాభారతంలో ఎదురైన పరిస్థితులు వచ్చినపుడు ఎలా ఫేస్ చేసారు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నాం అని వర్మ తెలిపారు. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆడియో ద్వారా ఇదంతా తెలిపుతారు. ఈ సిరీస్ గురించి మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది